పోల‌వ‌రాన్ని నిధుల్లేవు కానీ.. పెద్దిరెడ్డికి 8 వేల కోట్లా?: చంద్రబాబు నాయుడు

by Javid Pasha |
పోల‌వ‌రాన్ని నిధుల్లేవు కానీ.. పెద్దిరెడ్డికి 8 వేల కోట్లా?: చంద్రబాబు నాయుడు
X

దిశ‌, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప్ర‌తినిధి: “ దేశానికి అన్నంపెట్టిన ప్రాంతం గోదావరి డెల్టా. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా కాటన్ విగ్రహాలు కనిపిస్తుంటాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంతో ఆయన ఇక్కడి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. మంచిపని చేస్తే ప్రజలు అభిమానిస్తారు అనడానికి ఇదే నిదర్శనం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ జిల్లాలో ప్రతిఎకరాకు నీరు అందుతుంది. అలానే పరిశ్రమలకు నీటిసమస్య ఉండదు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వం సంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్షంలో ఉన్న మేం, మాకున్న వనరులతో సేకరించిన సమాచారంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నమే ఈ కార్యక్రమం చేప‌డుతున్నాం’’ అని తూర్పుగోదావ‌రి ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

టీడీపీ ప్రాజెక్టుల ఘ‌న‌త ఇది!

రాష్ట్రంలో ఓ మూర్ఖుడి పాల‌న‌తో మొత్తం స‌ర్వ‌నాశనం అయ్యింద‌ని టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తూర్పుగోదావ‌ర జిల్లాలో ప్రాజెక్టుల సంద‌ర్శ‌న నిమిత్తం చేప‌ట్టిన యాత్ర‌లో భాగంగా ఆయ‌న పోల‌వ‌రానికి జ‌రుగుతున్న అన్యాయంపై ప్ర‌జెంటేష‌న్ చేశారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబు రాష్ట్ర స‌మ‌స్య‌లు వివ‌రిస్తూ రాష్ట్రంలో 5 ప్రధాన నదులతో కలిపి మొత్తం 69 నదులున్నాయి. ముఖ్యమైన గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదుల్ని అను సంధానం చేస్తే రాష్ట్రంలో నీటిసమస్యే ఉండద‌న్నారు. 5 నదులు ఎక్కడో పుట్టి, మన రాష్ట్రంలోనే సముద్రంలో కలుస్తాయి. సముద్రం ఎత్తుకి భూమిఎత్తుకి మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవడం ఈ రాష్ట్రానికి ఉన్న అవకాశం. సాధారణ లిఫ్టులతో కాస్త తక్కువలో ఉన్న నీటిని పైకి తరలించవచ్చు.ఎన్టీఆర్ హాయాంలో తెలుగుగంగ, హంద్రీనీవా వస్తే, నేనువచ్చాక ముచ్చు మర్రి పూర్తిచేసి, సీమకు కృష్ణా, గోదావరి నీళ్లు తరలించ‌డం జ‌రిగింద‌న్నారు.

మొట్టమొద టిసారి కృష్ణా-పెన్నా నదుల్ని ఎన్టీఆర్ అనుసంధానం చేస్తే, తాను వచ్చాక పోలవరం ప్రధాన కుడికాలువపై పట్టిసీమ నిర్మించి, 120టీఎంసీల గోదా వరి నీటిని ప్రకాశం బ్యారేజ్ కి తరలించామ‌న్నారు. ఆ 120 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు అందించి, ఆ ప్రాంతానికి అందించాల్సిన కృష్ణానీటిని శ్రీశైలంలో పొదుపుచేసి, అక్కడినుంచి రాయలసీమకు తరలించ‌డం జ‌రిగింద‌న్నారు. గోదావరి నీటిని తరలించడం వల్లే రాయలసీమకు లబ్ధికలిగిందనని చంద్ర‌బాబు వివ‌రించారు. ఉత్తరాంధ్రలో నాగావళి వంశధార నదుల్ని హీరబ్యారేజ్ ద్వారా కలప‌డం జ‌రిగింద‌ని, ప్రాజెక్టుల నిర్మాణానికి 2014-19లో టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింద‌న్నారు. టీడీపీ హ‌యాంలో జ‌రిగిన ప్ర‌తీ ప్రాజెక్టు రైతుల‌కు ఉప‌యోగ‌క‌ర‌మైంద‌ని చంద్ర‌బాబు అన్నారు.

Advertisement

Next Story