- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో మొట్టమొదటిసారిగా.. ఫస్ట్ లిస్ట్ ప్రకటన తర్వాత CBN ఆసక్తికర ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాను నేడు రిలీజ్ చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రెస్ మీట్ ఏర్పాటు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 118 స్థానాలకు గాను 94 టీడీపీ, 24 జనసేలు పంచుకున్నాయి. టీడీపీ మొత్తం 94 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించగా.. జనసేన మాత్రం 5 సీట్లలో అభ్యర్థులను అనౌన్స్ చేసింది. పవన్ కల్యాన్, నాగబాబు ఎక్కడి నుంచి బరిలో నిలుస్తారన్న అంశంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తొలి జాబితా విడుదల తర్వాత ట్విట్వర్ వేదికగా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ‘దేశంలో మొట్టమొదటిసారిగా... విస్తృత స్థాయిలో 1 కోటి 3 లక్షల 33 వేల మంది ప్రజల అభిప్రాయాలు సేకరించి... నిజాయితీ, అంకితభావంతో కూడిన ప్రజాసేవ ప్రాతిపదికగా... ఎంపిక చేసిన తెలుగుదేశం-జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇది. ఏపీ ప్రజలారా! ఆశీర్వదించండి!!’ అంటూ ట్వీట్ చేశారు.
Read More..