- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీలపై ఫుల్ ఫోకస్... డిసెంబర్ 7న సీఎం జగన్ కీలక ప్రకటన
- జయహో బీసీ మహాసభ పోస్టర్ విడుదల
- జోనల్ వారీగా బీసీ సమావేశాలు పెడతాం
- - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- చంద్రబాబుకు వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలు
- ఇక జీవితంలో చంద్రబాబు సీఎం కాలేడు
- లోకేశ్ పొర్లు దండాల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు
- జయహో బీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మరో 25 ఏళ్లు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పేదల కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారని..అందుకే ప్రజల మద్దతు జగన్‌కే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 7న బీసీల ఆత్మీయ సదస్సు'జయహో బీసీ మహాసభ'ను నిర్వహించనున్నట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న ఈ బీసీ మహాసభకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఇతర బీసీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జయహో బీసీ మహాసభ పోస్టర్‌ను నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఈ మహాసభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై కీలక ప్రసంగం చేస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో జోనల్ వారీగా బీసీ మీటింగ్‌లు పెట్టనున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. వైసీపీ పాలనలో బీసీలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కిందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
2024 తర్వాత టీడీపీ ఉండదు: ఎంపీ విజయసాయిరెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తన జీవితంలో మళ్లీ సీఎం అవ్వలేడన్నారు. చంద్రబాబు కేవలం తన కులం, తన కుటుంబం, తన మనుషుల కోసమే పని చేశాడే తప్ప ప్రజల కోసం పని చేయలేదని చెప్పారు. మూడు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నిత్యం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. నారా లోకేశ్ అవలక్షణాలున్న వ్యక్తి అని...అలాంటి లోకేశ్‌ది పాదయాత్ర కాదని.. పొర్లు దండాలు యాత్ర చేసినా ప్రజలు నమ్మరని విమర్శించారు. లోకేశ్, చంద్రబాబులకు వచ్చే న్నికల తర్వాత రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. 2024 తర్వాత టీడీపీ కూడా ఉండదంటూ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
జయహో బీసీ మహాసభను సక్సెస్ చేయాలి: మంత్రి వేణు
బీసీ కులాలకి అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీలను వెన్నుముకకులాలుగా వర్ణించిన గొప్ప నాయకుడని కొనియాడారు. బీసీలను దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆదరించని విధంగా సీఎం జగన్ ఆదరించారని.. బీసీలు తలెత్తుకుని తిరిగేలా చేశారని కొనియాడారు. బీసీ రిజర్వేషన్లు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లు పెట్టిందని గుర్తు చేశారు. ప్రతి బీసీ ఇంటికి సంక్షేమాన్ని సీఎం జగన్ చేర్చారని చెప్పుకొచ్చారు. జయహో బీసీ మహా సభను చరిత్రలో ఎన్నడు జరగని విధంగా నిర్వహిస్తానని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు.
ఈ సమావేశంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, ఎంపీ మోపిదేవి వెంకట రమణ,ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరైయ్యారు.