Srisailam Project:శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద

by Jakkula Mamatha |
Srisailam Project:శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద
X

దిశ,శ్రీశైలం ప్రాజెక్టు:శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన వరద. ఎగువ పరివాహక ప్రాంతాలు అయినటువంటి జూరాల సుంకేసుల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండలా తలపిస్తుంది. జూరాల 2,69,914 సుంకేసుల 99,153 క్యూసెక్కులు,శ్రీశైలం జలాశయానికి వరద వచ్చి చేరుతోంది. జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 3,69,067 ఉండగా ఔట్ ఫ్లోగా, 3,75,178 ఎడమ కుడి జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.00 అడుగులుగా ఉంది. అలానే జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.7889 టీఎంసీలుగా ఉంది.

Advertisement

Next Story