- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టన్నుల కొద్ది చేపలు ఫ్రీ.. ఎగబడి ఎత్తుకుపోతున్న జనం
దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ తుఫాన్ కారణంగా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని మత్య్సకారులకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత పది రోజులుగా మత్య్సకారులు ఇంటికే పరిమితం అయ్యారు.
మరోవైపు తుఫాను కారణంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా సముద్రంలో భారీ అలల ఏర్పడుతున్నాయి. ఈ అలలకు సముద్రంలో ఉన్న చిన్న సైజు చేపలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో విశాఖపట్నంలోని పలు బీచ్‌లలో టన్నుల కొద్ది చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో స్థానికులు గోనె బస్తాలు, బ్యాగులు తీసుకెళ్లి క్వింటాళ్ల కొద్ది ఎత్తుకొచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.