ఫస్ట్ టైమ్ బాబాయ్‌కి సపోర్ట్‌గా మెగా డాటర్ పోస్ట్.. క్షణాల్లో వైరల్

by GSrikanth |
ఫస్ట్ టైమ్ బాబాయ్‌కి సపోర్ట్‌గా మెగా డాటర్ పోస్ట్.. క్షణాల్లో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, పవర్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా ఇప్పటికే నియోజకవర్గంలో అనేక మంది సినీ ప్రముఖులు ప్రచారం నిర్వహించారు. మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్.. జబర్దస్త్ నటుల్లో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ సహా అనేక మంది విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం చివరి రోజున తల్లి సురేఖతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగంలోకి దిగారు. స్వయంగా బాబాయ్ పవన్ కల్యాణ్‌తో కలిసి పిఠాపురం ఓటర్లకు అభివాదం చేస్తూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇక అప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లు సోషల్ మీడియా వేదికగా తమ తమ మద్దతును ప్రకటించారు. ఇక చివరంగా మెగా డాటర్ సుస్మిత సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘అతని పోరాటం నిజమైనది. ఆయన హృదయం ప్రజల కోసమే. అతను నిజం కోసైం నిలబడతాడు. దయచేసి అండగా నిలబడండి’ అని సుస్మిత కొనిదెల రిక్వెస్ట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story