- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
#APBudget2024: ఏపీ బడ్జెట్‌లో ఏడు ప్రధాన అంశాలు ఇవే...!
దిశ, వెబ్ డెస్క్: ఏడు అంశాలతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షే ఆంధ్ర, భూ భద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర ఆంశాల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించామన్నారు. రూ. 2 లక్షల 86 వేల 389 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోధనా ఆస్పత్రులకు రూ. 16,852 కోట్లు ఖర్చు చేసినట్లు బుగ్గన పేర్కొన్నారు. విదేశాల్లోని 50 ఉన్నత విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు సాయం అందించామన్నారు. డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతానికి తగ్గిందని తెలిపారు. 34 లక్షల మందికి ఉచితంగా విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేశామన్నారు. జగనన్న విద్యా వసతి దీవెనకు రూ. 4,267 కోట్లు కేటాయించామన్నారు. జగనన్న విద్యా దీవెనకు రూ.11901 కోట్లు విడుదల చేశామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.