- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. వైసీపీ ఇన్‌చార్జుల ఐదో లిస్ట్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఆయా నియోకవర్గాల ఇన్‌చార్జులను పలు సర్వేల ఆదారంగా మారుస్తూ.. మొత్తం ఐదు విడతలుగా ఇన్‌చార్జులను ప్రకటించింది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి ఐదో లిస్టును మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ లిస్టులో మొత్తం ఏడుగురు ఇన్‌చార్జులను వైసీపీ అధిష్టానం ప్రకటించింది.
అరకు(ఎస్టీ) రేగం మత్స్య లింగం, కాకినాడ(ఎంపీ) చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం(ఎంపీ) సింహాద్రి రమేష్ బాబు, అవనిగడ్డ డా. సింహాద్రి చంద్రశేఖర రావు, నర్సరావుపేట(ఎంపీ) పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, సత్యవేడు(ఎస్సీ) నూకతోటి రాజేష్, తిరుపతి (ఎస్సీ)(ఎంపీ) మద్దిల గురుమూర్తి లకు చోటు దక్కింది. ఈ రోజు విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం నాలుగు ఎంపీ స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
కాగా ఈ లిస్టులో తిరుగుబాటు నాయకుడు ఆదిమూలపు సురేష్.. రెండు చోట్ల కూడా టికెట్ ను కోల్పోయారు. అలాగే.. తిరుపతి ఎంపీ, సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ల పై కూడా మరోసారి మార్పు జరిగింది. ఆయన స్థానంలో నూకతోటి రాజేష్ కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. అలాగే నాలుగో లిస్టులో తిరుపతి ఎంపీ గురుమూర్తికి కేటాయించగా.. తాజాగా ఎస్పీ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి టికెట్ ఇచ్చారు. గతంలో వైసీపీ ప్రకటించిన ఇన్‌చార్జుల జాబితాలతో పలువురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీపై తిరుగుబాటు ప్రకటించారు. మరి ఈ లిస్ట్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.