Nandamuri Tarakaratnaకు కడసారి వీడ్కోలు

by srinivas |   ( Updated:2023-02-20 10:44:44.0  )
Nandamuri Tarakaratnaకు కడసారి వీడ్కోలు
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి తారకరత్నకు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు అభిమానులు. ఉదయం నుంచి తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. దీంతో అభిమానులు, రాజకీయ, సినీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. తారకరత్నతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అయితే మరికాసేపట్లో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు తారకరత్న పార్ధివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి అంతియయాత్రగా తరలిస్తున్నారు. బాబాయ్ నందమూరి బాలకృష్ణ నిర్ణయించని సమయానికి తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.

కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం కుప్పం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటు రావడంతో స్పృహతప్పి పడిపోయారు. స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఆయనను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. 23 రోజుల పాటు చికిత్స పొందిన తారకరత్న చివరకు తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని ఆదివారం హైదరాబాద్ శంకర్ పల్లి మండలం మోకిలలోని స్వగృహానికి తరలించారు. అనంతరం అభిమానుల సందర్శనార్ధం ఈ ఉదయం నుంచి కొద్దిసేపటి వరకు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. మరి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story