AP Politics: ఆ నియోజకవర్గంలో రెక్కలు ఊడిపోతున్న ఫ్యాన్!

by Disha Web Desk 18 |
AP Politics: ఆ నియోజకవర్గంలో రెక్కలు ఊడిపోతున్న ఫ్యాన్!
X

దిశ,ఎర్రగొండపాలెం: నియోజకవర్గంలో ఒకసారి కాంగ్రెస్ రెండుసార్లు వైసీపీ గెలిచి రెండవ పులివెందులగా నిలిచింది. అయితే ఈ సారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కారణం మండల నాయకుల మధ్య పొంతన లేకపోవడం. మండల స్థాయిలో గ్రూపులుగా ఏర్పడి అంతర్గత కుమ్ములాటలతో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం. అభ్యర్థి చంద్రశేఖర్ ఒంటెద్దు పోకడ ప్రదర్శించడం ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతీలలో వైసీపీ నాయకులు ప్రజల అవసరాలు తీర్చకపోవడం ప్రజల పై నాయకులు దౌర్జన్యాన్ని ప్రదర్శించటం. నీళ్ల కోసం గ్రామస్తులు అల్లాడుతున్న నాయకులు పట్టించుకోకపోవడంతో వైసీపీ నాయకులు పై నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది.

పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకులను కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో వైసీపీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అంటున్నారు ప్రజలు. అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ కొత్త వాడు కావడంతో ఇక పాత నాయకులు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. ఇక్కడ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీ జెండా ఎగిరింది లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేష్ పై నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అదే పార్టీ అభ్యర్థిగా వచ్చిన చంద్రశేఖర్ పై వ్యతిరేకత లేకపోయినా గ్రామ స్థాయి నాయకులు చేసిన చిల్లర పనులపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇదే అదునుగా భావించిన టీడీపీ మునుపటి కంటే భిన్నంగా గ్రౌండ్ లెవెల్ లో ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతూ కొత్త కొత్త రాజకీయ ఎత్తులను అవలంబిస్తోంది. నియోజకవర్గంలో మునుపటి పరిస్థితి చూసి తనకు తిరుగులేదు తానే ఎమ్మెల్యేగా గెలుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed