Eluru: ద్వారకా తిరుమలలో పురాతన గుట్టపై కలకలం.. భయాందోళనలో ప్రజలు

by srinivas |   ( Updated:2024-08-12 13:05:31.0  )
Eluru: ద్వారకా తిరుమలలో పురాతన గుట్టపై కలకలం.. భయాందోళనలో ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈజీగా డబ్బులు సంపాదించొచ్చనే అపోహతో కొందరు వ్యక్తులు పురాతన స్థలాలు, గుట్టలు, ఆలయాల్లో గుప్త నిధులు తవ్వకాలు జరుపుతున్నారు. పలుగులు, పారలు చేపట్టి పురాతన ఆలయాలు, స్థలాలు, గుట్టల చుట్టూ తిరుగుతున్నారు. పెద్ద పెద్ద గుంతలు తవ్వి చూస్తున్నారు. అలా కొందరు స్థానికులు దొరికి తన్నులు తింటున్నారు. మరికొందరు పారిపోరుతున్నారు. ఇలాంటి ఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో తాజాగా జరిగింది. స్థానిక కుచ్చేల‌మెట్టపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా గుప్త నిధుల తవ్వకాలు జరిపారు. భూమికి పూజలు చేసి మరీ పలుగు, పారలతో తవ్వకాలు చేపట్టారు. అయితే ఏమీ దొరకకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ కుచ్చేల‌మెట్ట గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారని తెలిపారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇప్పటికైనా నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story