- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ambati Rambabu:పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి.. సెన్సేషనల్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి, వైసీపీ నేతల(YCP Leader) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న వరుస లైంగిక దాడుల(sexual assault) ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో ఆరోపించిన పవన్ కల్యాణ్.. ఇప్పటిదాకా ఆ అదృశ్యమైన వాళ్లలో ఒక్కరినైనా కనిపెట్టారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని పవన్ అన్నారని, తాము మొదటి నుంచి అదే కదా చెబుతున్నామని ఆయన అన్నారు. ఈ క్రమంలో పాలన చేతకాక పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇలా తప్పించుకుంటున్నారని అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పిఠాపురం ఘటనలో ఎంత మందిని అరెస్టు చేశారు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాల పై ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్(Politics) అంటున్నారని అంబటి రాంబాబు(Ambati Rambabu) ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదని ఆయన అన్నారు. మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్ ఒత్తిడితో కేసులుపెట్టి వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెడితే న్యాయ సాయం అందిస్తాం.. పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు.