AP News:వైసీపీ కార్యకర్తలకు మాజీ సీఎం జగన్ భారీ గుడ్ న్యూస్..?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-07 10:23:36.0  )
AP News:వైసీపీ కార్యకర్తలకు మాజీ సీఎం జగన్ భారీ గుడ్ న్యూస్..?
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రెండో రోజు కడప జిల్లా, పులివెందుల పర్యటన కొనసాగుతోంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో వైఎస్ జగన్ కార్యకర్తలను పరామర్శిస్తూ..వారికి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు పులివెందులలోని భాకరాపురం లో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు పార్టీ తోడుగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో రేపు (జులై 8న) వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మాజీ సీఎం జగన్ తీపి కబురు వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారికి జీవిత బీమా, ప్రమాద బీమాను ప్రకటిస్తారని సమాచారం. ఎంత మొత్తం అనేది ఇంకా నిర్ధారణ కాలేదని 10 లక్షల రూపాయల వరకు బీమా ఉండొచ్చని అంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ (బద్వేలు), అకేపాటి అమర్‌నాథ్ రెడ్డి (రాజంపేట) సహా కడప, అన్నమయ్య రాయచోటి, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈక్రమంలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్‌ను కూడా నిర్వహించారు.

Advertisement

Next Story