ఆ 23 సీట్లు కూడా 2024లో రావటగా!: టీడీపీపై విజయసాయిరెడ్డి

by Seetharam |   ( Updated:2023-10-08 12:17:43.0  )
ఆ 23 సీట్లు కూడా 2024లో రావటగా!: టీడీపీపై విజయసాయిరెడ్డి
X

దిశ , డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ టీడీపీ అధిష్టానం శనివారం కాంతితో క్రాంతి అనే కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంతో టీడీపీ ఆరిపోయే దీపమని చెప్పకనే చెప్పారంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో లైట్లు ఆపేసిన ఇళ్లను లెక్కవేసుకుంటే 2019లో వచ్చిన ఆ 23 సీట్లు కూడా 2024లో రావటగా! అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం తామెందుకు లైట్లు ఆర్పాలని తెలుగు తమ్ముళ్లు సైతం అనుకుంటున్నారటకదా అని ప్రశ్నించారు. కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిస్తే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు టపాసులు కూడా కాల్చారంటే వారి ఆనందం వెనక వేరే అర్థం ఉందేమోనన్నారు. ‘ఏది ఏమైనప్పటికీ టీడీపీ ఆరిపోయే దీపమని సింబాలిక్‌గా మీరే చెప్పేశారని, ఏదైతో ఉందో.. నభూతో నభవిష్యత్..’ అంటూ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed