- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు: పవన్‌పై సీఎం జగన్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండిపెండెంట్‌గా నిలబడిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని.. గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని.. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదని మండిపడ్డారు. కుప్పం నియోజవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందంటూ సీఎం వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పొత్తులపై సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. బాబు ఇంకో పార్ట్‌నర్. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేద’ అని సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
విశాఖకు వస్తానంటే ఏడుస్తున్నారు
మరోవైపు విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు అని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు అని ధ్వజమెత్తారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాల్లో నిర్ణయిస్తామంటారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.