యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్

by Javid Pasha |
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్
X

దిశ, ఉత్తరాంధ్ర: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వితేజ్‌ ఇమ్మడి యువతకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన సంస్థ ఆవరణలో గోడపత్రికను కూడా ఆవిష్కరించారు. తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులు, సిబ్బందితో కలిసి కొద్దిసేపు నినాదాలు చేపట్టారు.

కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు డి.చంద్రం, ఏవీవీ సూర్య ప్రతాప్‌, సీజీఎం అచ్చి రవికుమార్‌, ఏపీ యాంటీ డ్రగ్స్‌ అండ్‌ యాంటీ ఆల్కహాల్‌ క్యాంపెయిన్‌ కన్వీనర్‌ సురేష్‌ బేతా, డాక్టర్‌ సంతోష్‌, లిఖిత్‌ బేతా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story