రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్.. మహిళ గొంతుకోసి భర్తపై దాడి

by Seetharam |
రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్.. మహిళ గొంతుకోసి భర్తపై దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం విజయనగర్ కాలనీలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. ఇంటి ఆరుబయట ఉన్న మహిళ మెడలో నుంచి చైన్ దొంగిలించేందుకు చైన్ స్నాచర్స్ ప్రయత్నించారు. అయితే మహిళ ప్రతిఘటించడంతో దుండగులు ఆమె గొంతు కోశారు. గట్టిగా భార్య కేకలు వేయడంతో భర్త ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపైనా చైన్ స్నాచర్స్ దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ నుంచి చైన్ స్నాచర్స్ పరారయ్యారు. చైన్ స్నాచర్స్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ, ఆమె భర్తను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Next Story