- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తునిలో టీడీపీకి భారీ షాక్.. వైసీపీలోకి యనమల సోదరుడు..!
దిశ, వెబ్ డెస్క్: తుని టీడీపీకి భారీ షాక్ తగలనుంది. వచ్చే ఎన్నికల్లో తుని టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ఖరారు కావడంతో ఆయన సోదరుడు కృష్ణుడు అసంతృప్తిగా ఉన్నారు. ఇంతకాలం అన్న పోటీ చేయడంతో కృష్ణుడు నియోజకవర్గంలో పార్టీని పతిష్టం చేస్తూ వచ్చారు. యనమల రామకృష్ణ గెలుపులో తమ్ముడు కృష్ణుడు కీలక పాత్ర వహించారు. అయితే గత రెండు పర్యాయాలు యనమల కృష్ణుడు పోటీ చేసినా ఓటమి పాలమి అయ్యారు. దీంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు యనమల దివ్యకు ఈసారి టికెట్ కేటాయించినట్లు తుని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈసారి కూడా యనమల కృష్ణుడు పోటీ చేయాలని భావించారు. కానీ టీడీపీ అధిష్టానం యనమల దివ్యకు సీటు కేటాయించడంతో భంగపాటుకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీని వీడే యోచనలో కృష్ణుడు ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నెల 15 లేదా 17న వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాకు సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. అయితే యనమల కృష్ణుడు వైసీపీలో చేరికపై దాడిశెట్టి రాజా స్పందించారు. కృష్ణుడు వైసీపీలో చేరడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
Read More..
నరసాపురం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా : రఘురామకృష్ణంరాజు