Varahi Yatra: సీఎం జగన్, పేర్ని నానిపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-06-16 16:01:09.0  )
Varahi Yatra: సీఎం జగన్, పేర్ని నానిపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ క్రిమినల్స్ అడ్డా అయిపోయిందని పవన్ కల్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ జంక్షన్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ కుటుంబానికే దిక్కులేదని, ఇక సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. యువతను మత్తుకు బానిసలను చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ వల్ల రాష్ట్రం మొత్తం మత్తులో జోగుతోందని ఆరోపించారు. నేరచరిత్ర ఉన్న ఈ సన్నాసులా మనల్ని పాలించేదన్నారు. ఈ పెద్ద మనిషికి తానంటే భయమని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లకు వీర మహిళలంటే భయమని ఎద్దేవా చేశారు. వైసీపీకి జనసైనికులంటే భయమని చెప్పారు. పదవిపై ఆశ లేకుండా జనం తరపున నిలబడతానని పవన్ తెలిపారు.

జనసేన అధికారంలోకి వస్తే శాంతి భద్రతలను కట్టుదిట్టం చేస్తానన్నారు. లేకుంటే కాకినాడ ఎమ్మెల్యే లాంటి వాళ్లు రోడ్డెక్కుతారని సెటైర్లు వేశారు. తనకిష్టమైన రెండు చెప్పులను ఎవరో దొంగిలించారని ఎద్దేవా చేశారు. గుడిలో పెట్టిన చెప్పులను కూడా వైసీపీ దొంగిలిస్తోందని పేర్ని నానిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. తనకు సనాతన ధర్మం అంటే గౌరవం ఉందని, కానీ మత పిచ్చి మాత్రం లేదన్నారు. పిఠాపురంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఆయన తప్పుబట్టారు. దేవాలయాల ధ్వంసం దారుణమని మండిపడ్డారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నా ఆంధ్ర విడిచి వెళ్లనని పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రా నాయకులు దోపిడీ చేశారని తిట్టినా మన నేతలకు బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. వేల కోట్లు ఉన్నా పార్టీని నడపలేని వారున్నారు. ప్రజలు ఉన్నారు కాబట్టే పవన్ కల్యాణ్ పార్టీని నడపగలుగుతున్నారని ఆయన చెప్పారు. ఓ పార్టీని 10 ఏళ్ల పాటు నడపడం మామూలు విషయం కాదని పవన్ పేర్కొన్నారు.

Also Read..

ఒక్క సెకన్ సీన్‌తో ‘ఆదిపురుష్’ మొత్తం చెత్త అని తేల్చేశారా?

Advertisement

Next Story