వైసీపీకి బిగ్ షాక్.. పార్టీ మారేందుకు సిద్ధమైన మరో ఎమ్మెల్యే

by srinivas |
వైసీపీకి బిగ్ షాక్.. పార్టీ మారేందుకు సిద్ధమైన మరో ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతున్నారు. సర్వేల పేరుతో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేకు సైతం ఆయన సీట్లు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమించారు. దీంతో ప్రత్యామ్నాయంవైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు. తాజాగా ఐదో లిస్టు విడుదలయిన నేపథ్యంలో వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గెలిచారు. అయితే ఈసారి ఎన్నికలకు ముందే ఆయన సీఎం జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. జగ్గంపేట ఇంచార్జిగా తోట నరసింహాన్ని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అసంతృప్తిగా ఉన్నారు. వేరే నియోజకవర్గం నుంచి అయినా సీటు ఇస్తారనే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఐదు లిస్టు కూడా విడుదల చేయడంతో చంటిబాబు ఆశలు వదులుకున్నారు. అనుచరులు, కార్యకర్తలతో గురువారం జగ్గంపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ నుంచి తోట నరసింహానికి సీటు కేటాయిస్తే తాము సహకరించమని చంటిబాబు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. పార్టీ మారాలని ఎమ్మెల్యే చంటిబాబుకు సూచించారు. దీంతో మరో పది రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే చంటిబాబు ప్రకటించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed