చిరుత పులి సంచారం.! అప్రమత్తమైన అటవీ శాఖ

by Geesa Chandu |
చిరుత పులి సంచారం.! అప్రమత్తమైన అటవీ శాఖ
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో చిరుత పులి సంచరిస్తున్న వేళ అటవీ శాఖ అప్రమత్తమైంది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం మండలంలో గల లాలాచెరువు సమీపంలోని గోదావరి మహా పుష్కర వనం హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో.. అర్ధరాత్రి చిరుతపులి సంచరించి ఒక జంతువును అమాంతం నోట కరుచుకొని వెళ్లిందనే వార్త స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. అయితే ఇది నిజమా? కాదా? అనే వాస్తవాన్ని తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడ ఓ ప్రదేశంలో అనుమానాస్పదంగా జంతువు పాదముద్రలను(Pug marks) కనిపించేసరికి.. అది ఏ జంతువుకు సంబంధించినవో తెలుసుకునే పనిలో పడ్డారు అటవీ అధికారులు. దీంతో పాటు గోదావరి పుష్కర వనంలో జంతువుల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి అది ఏ జంతువో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇంకా అక్కడే జంతువులను బంధించేందుకు ఒక బోను ను కూడా ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ సెక్షన్ డీఆర్ఐ పద్మావతి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed