- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Varahi Yatra: ఈసారి ఖాయం.. సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: తనను అడ్డుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారని, దమ్ముంటే అడ్డుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి సభలో వారాహి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్ పార్టీ నడిపేందుకే తాను సినిమాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వైసీపీకి దీటైన పార్టీ జనసేన మాత్రమేనని హెచ్చరించారు. తనను అడ్డుకునేందుకు సినిమాలను కూడా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్లపై కూడా దిగజారిపోయి వ్యవహరించిన వ్యక్తి సీఎం జగన్ అని ధ్వజమెత్తారు. తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదని కక్ష గట్టి ఓడించారని మండిపడ్డారు. ఈసారి తనను అసెంబ్లీకి రాకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు.
తనను పాలించే వ్యక్తి తన కంటే నీతిపరుడై ఉండాలనేదే తన కోరిక అని చెప్పారు. పాలించే నాయకులకు బానిసం కాదని, అక్రమంగా వేల కోట్లు కూడబెట్టిన వాళ్లతోనే తనకు గొడవ అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈసారి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని చెప్పారు. అందరి పర్సనల్ విషయాలు కూడా తనకు తెలుసన్నారు. ప్రభుత్వం తన గురించి తెలుసుకోవాలంటే ఇంటెలిజెన్స్ కావాలని పవన్ పేర్కొన్నారు. తనకు ఇంటెలిజెన్స్ అవసరం లేదని, తన ఫ్యాన్సుచాలన్నారు. తన బిడ్డల కోసం దాచి పెట్టిన నిధులతో జనసేన పార్టీ కార్యాలయం కటించానని పవన్ తెలిపారు. తన బిడ్దల బదులు ప్రజలందరూ తన బిడ్డలేనని అనుకున్నానని పవన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Pawan Varahi Yatra: అది సాధారణ విషయం కాదు.. జనసేన పార్టీపై పవన్ కీలక వ్యాఖ్యలు