Tuniలో బీటలు.. మాజీ మంత్రి యనమల భవిష్యత్తేంటో..!

by srinivas |   ( Updated:2022-12-13 15:10:25.0  )
Tuniలో బీటలు.. మాజీ మంత్రి యనమల భవిష్యత్తేంటో..!
X

దిశ (ఉభయ గోదావరి): తెలుగుదేశం పార్టీలో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు సీటు దక్కని పరిస్థితి నెలకొంది. కనీసం ఆయన కుటుంబంలో ఎవరికి కూడా సీటు ఇచ్చే పరిస్థితిల్లో అధిష్టానం లేనట్లుగా తెలుస్తోంది. పలు సర్వేల ద్వారా యనమల కుటుంబాని తునిలో ప్రాబల్యం లేదనే విషయం అధిష్టానం గుర్తించింది. దీంతో నియోజకవర్గంలో మాజీ శాసన సభ్యుడు రాజా అశోక్ బాబుకుగానీ, బీసీల్లో మేజర్ కమ్యూనిటీ అయిన శెట్టి బలిజలకు గాని సీటు ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొన్నటి దాకా ఉమ్మడి తూర్పు గోదావరి జల్లాల్లో ఎంతో మందికి సీట్లకోసం సిఫారసు చేసిన యనమల తనకు సీటు లేదనే విషయం ప్రచారంలోకి రావడంతో ఆయన డీలా పడిపోతున్నారు . రెండు పర్యాయాలు నుంచి స్థానికంగా గెలుపు సాధిస్తున్న రోడ్లు భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా తనదైన ముద్ర నియోజకవర్గంపై వేసుకొంటున్నారు. నయానా భయానా యనమల కోటరీకి ఆయన బీటలు వారుస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నుంచి చురుకుగా పాత్ర పోషించే వారిపై ఆయన స్కెచ్ వేస్తున్నారు. తన దారిలోకి తెచ్చుకునేందుకు మంత్రి శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

యనమల కోటరీకి గండి కొట్టేందుకు మంత్రి శత విధాలా ప్రయత్నాలు

2014 ఎన్నికల్లో దాడిశెట్టి రాజా తొలిసారి విజయం సాదించారు. నాటినుంచి నియోజకవర్గంలో తన పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తర్వాత 2019లో ఆయన రెండోసారి గెలుపు సాధించారు.అంతేకాదు రెండో దఫా విస్తరణలో మంత్రి అయ్యారు. అయితే దాటిశెట్టి తన మార్కు కోసం నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. జనంలోకి చొచ్చుకుపోయే విషయంలో దాడిశెట్టి రూటే సెపరేటు. అన్ని వర్గాల వారిని ఆయన కలుపుకొని పోతున్నారు. కాకినాడ సిటీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో దాటిశెట్టికి మంచి అనుబంధం ఉంది. అవసరమయితే కొన్ని సమస్యలు పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కూడా సంప్రదిస్తున్నారు. కాపు కులం అవ్వడం , దీనికి తోడు మేజర్ కమ్యూనిటీ అవ్వడంతో రాజా చాలా ఈజీగా జనంలో రాణించగలుగుతున్నారు.

చతికిల బడ్డ యనమల కుటుంబం

తాజా పరిణామాలతో మాజీ మంత్రి, టీడీపీ దిగ్గజం యనమల రామకృష్ణుడు, ఆయన కుటుంబం చతికిల పడంది. సొంత పార్టీ వారు కూడా సీటు ఇవ్వలేమనే సంకేతాలు పంపిస్తున్నట్లు సమాచారం . ఇందులో భాగంగానే వ్యూహత్మకంగా మాజీ శాసన సభ్యుడు రాజా అశోక్ బాబును రప్పించుకొని అధినేత చంద్రబాబు పలు విషయాలు చర్చించారు. అయితే అవకాశం ఉంటే తుని సీటు శెట్టబలిజలకు ఇస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో ఆలోచిస్తున్నారు. తుని బీసీల్లో బలమైన సామాజిక వర్గం శెట్టిబలిజలు కూడా అధికంగా ఉన్నారు. అంతేగాక ఈసారి యనమలను ఎన్నికలకు దూరంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు. యనమల అంటే పార్టీలో చాలా మందికి వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. పార్టీలో ఎంత కష్టపడినా యనమల అంతంత మాత్రమే ప్రిపరెన్సు ఇస్తారని కార్యకర్తలు అంటున్నారు. చాలా తక్కువగా మాట్లాడతారని అంటున్నారు. ఇత్యాది పరిణామాలతో యనమలపై చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు ఏమీ అనుకున్నా యనమల అంటే చంద్రబాబుకు అభిమానం . దీంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

Ys Jagan: పెన్షన్‌దారులకు శుభవార్త.. Cabinet Meetలో కీలక నిర్ణయం

Advertisement

Next Story

Most Viewed