- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Varahi Yatra: ఆ పదం వద్దు.. దయ చేసి తీసేయండి... కార్యకర్తలకు పవన్ విజ్ఞప్తి
దిశ, వెబ్ డెస్క్: కాపు మాజీ ఉద్యమ నేత ముద్రగడను జనసేన అధినేత పవన్ కల్యాణ్ గౌరవించారు. ఆయన చేపట్టిన వారాహి యాత్ర తూర్పుగోదారివరి జిల్లా మల్కిపురంలో జరిగింది. అయితే పవన్ సభలో ముద్రగడకు వ్యతిరేకంగా జనసైనికులు బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అయితే పవన్ కల్యాణ్ పెద్దవాళ్లను గౌరవించాలంటూ ఆ ఫ్లెక్సీలను తీయించివేశారు. పెద్దవాళ్లు మాటంటుంటారని.. మనం దాన్ని తీసుకోవాలని, అంతేకాని మనసులో పెట్టుకోకూడదని, ముద్రగడను గౌరవించాలని, తన మాట వినాలని జనసేన కార్యకర్తలకు పవన్ విజ్ఞప్తి చేశారు.
కాగా పవన్ కల్యాణ్‌కు ఇటీవల ముద్రగడ పద్మనాభం రెండు లెటర్లు రాశారు. పవన్ భాష మార్చుకోవాలని ఒకసారి, అభిమానులను కంట్రోల్ చేయాలని మరోసారి లేఖలు రాశారు. అంతేకాదు తనపై పోటీ చేయాలంటూ పవన్ కల్యాణ్‌కు ముద్రగడ సవాల్ విసిరారు. అయితే దీనికి పవన్ స్పందించలేదు. కానీ ఈ రోజు పవన్ సభలో ఆసక్తికర ఘటన జరిగింది.