YS Sharmila:‘ఎంత వేడుకున్నా వదిలిపెట్టొద్దు’.. శ్రీరెడ్డి పై వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |   ( Updated:2024-11-14 15:43:13.0  )
YS Sharmila:‘ఎంత వేడుకున్నా వదిలిపెట్టొద్దు’.. శ్రీరెడ్డి పై వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా(Social Media) కార్యకర్తలపై పోలీసులు కేసులు కొనసాగుతున్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అరెస్ట్‌లు సైతం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నటి శ్రీరెడ్డి(Actress Sri Reddy) మరోసారి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టుల కేసులో తనను వదిలేయాలంటూ మంత్రి లోకేష్‌(Minister Lokesh)కు శ్రీరెడ్డి రాసిన లేఖ పై తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) పరోక్షంగా స్పందించారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇది పొలిటికల్ ఇష్యూ(Political Issue) కాదు, సోషల్ ఇష్యూ(Social Issue). ఎన్నో బూతులు మాట్లాడారు. అసలు లిమిట్ లేకుండా పోయింది. అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, కామెంట్స్ చేసినా కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా, క్షమాపణలు కోరిన విడిచిపెట్టొద్దు’ అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

Read More : శ్రీరెడ్డి సారీల పర్వం.. ఫస్ట్ జగన్, ఆ తర్వాత లోకేశ్

Advertisement

Next Story