- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షర్మిల ఫ్యామిలీలోకి చంద్రబాబు సామాజికవర్గ కోడలు.. అసలు బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
దిశ, ఫీచర్స్: వైఎస్ షర్మిల కుటుంబంలో మరో నెల రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. కుమారుడి ప్రేమ వివాహాన్ని షర్మిల అంగీకరించడమే కాకుండా గ్రాండ్‌గా పెళ్లి చేయడానికి కూడా సిద్ధమవడంతో వైఎస్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ క్రమంలోనే స్వయానా షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఆమె మూడేళ్ల తర్వాత పెళ్లి కార్డు ఇవ్వడానికి కలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జనవరి 22న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న పెళ్లి జరుగనుంది. ఈ క్రమంలోనే వధువు అట్లూరి ప్రియకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌పై సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.
వైఎస్ కుటుంబంలోకి వచ్చే అట్లూరి ప్రియ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె ఎక్కడ నివాసం ఉంటుంది? అనే విషయాలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, అట్లూరి ప్రియా చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని ముందుగా ప్రచారం జరిగింది. కానీ, ప్రియా అట్లూరి ప్రసాద్ మనవరాలు కాదని మరో వార్త కూడా వినిపిస్తోంది. బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె అట్లూరి ప్రియా అని, అట్లూరి శ్రీనివాస్ కు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉందని తెలుస్తోంది.
బ్రదర్ అనిల్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కూడా చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. దీంతో సీఎం జగన్‌కు రాజకీయ శత్రువైన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఫ్యామిలీని షర్మిల కోడలిగా ఆహ్వానించడం కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.