- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడికి జనసేన టికెట్.. పునరాలోచనలో పడిన పవన్
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కూటమిలో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి యనమల భాస్కర్‌రావు పోటీ చేస్తున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డికి ఆయన అనుచరుడని, సీటు ఎలా ఇచ్చారంటూ స్థానిక జనసేన నేతలు, నాయకులు నిలదీస్తున్నారు. ఇంతకాలం పార్టీ కోసం పని చేసిన నాయకులను కాదని, వైసీపీకి చెందిన మంత్రి అనుచరుడికి సీటు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. యనమల భాస్కర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించమని చెబుతున్నారు. తొలి నుంచి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తికే సీటు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అలా కాని పక్షంలో తామంతా తలో దారి చూసుకుంటామని హెచ్చరించారు. దీంతో జనసేన అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. యనమల భాస్కర్‌రావు గతానికి సంబంధించి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. కూటమి నేతలతో చర్చించి అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని సమాచారం.