- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:రాష్ట్రంలో పిల్లలు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత:డీజీపీ
దిశ ప్రతినిధి, చిత్తూరు:రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పిల్లలు, మహిళల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతి తిరుమల పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం ఆయన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా కాణిపాకానికి విచ్చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు తాను అత్యంత ప్రాధాన్యత నిస్తానన్నారు. ఈ నేపథ్యంలో, పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా మార్చడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ దాడులు, ప్రతి దాడులు ఉపేక్షించేది లేదన్నారు. దాడులు చేసే వారు ఏ పార్టీకి చెందిన వారైనా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో గతంలో జరిగిన దాడులు ప్రస్తుతం జరుగుతున్న దాడులు కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ దాడుల సంస్కృతి పునరావృతం కాకుండా నివారించడానికి కోసం ఎస్పీలతో నిత్యం సమీక్షిస్తున్నానని పేర్కొన్నారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచుతూ, పోలీసు శాఖలో ఆధునిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ క్రమంలో సీసీ కెమెరాలు, డ్రోన్లు, డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్ వంటివి విస్తృతంగా ఉపయోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా భద్రత లో బాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌లను రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తామన్నారు. రహదారి ప్రమాదాలు తగ్గించడానికి, రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని పేర్కొన్నారు. రోడ్లపై సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి, రోడ్డు నియమాలను కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో మాత్రమే లభించే ఎర్రచందనం వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. దానిలో భాగంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యం, నాటు సార రవాణా, తయారి మరియు విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెక్ పోస్ట్ లను బలోపేతం చేస్తూ విస్తృతంగా వాహనాల తనిఖీలు, అనుమానాలు ఉన్న ప్రదేశాలలో విస్తృత దాడులు నిర్వహిస్తామన్నారు. ఈ విషయంలో ప్రజలు అందించే సహకారం మాకు చాలా కీలకమని పేర్కొన్నారు. దిశా చట్టం ఇంకా పార్లమెంట్‌లో రూపకల్పన దాల్చలేదు కావున రాష్ట్రంలో కొత్తగా నామకరణం చేసి ఆ చట్టాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న దిశ పోలీస్ స్టేషన్‌లో ఇకపై ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.