Devara movie:‘దేవర’ జాతర ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదిన వైనం

by Jakkula Mamatha |
Devara movie:‘దేవర’ జాతర ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదిన వైనం
X

దిశ,వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ’దేవర‘ నేడు (సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూశారో తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించింది. ఇక నేడు దేవర రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా థియేటర్లలో రిలీజైంది. అభిమానులు ప్రీమియర్ షోల్లో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులతో జాతరను తలపిస్తుంది. ఈ క్రమంలో ఏపీలోని కడప జిల్లాలో రాజా థియేటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కడపలోని రాజా థియేటర్ వద్ద జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ‘దేవర’ రిలీజ్ షో సందర్భంగా చాలామంది అభిమానులు టికెట్ లేకుండానే థియేటర్‌లోకి దూసుకొచ్చారు. వారిని ఆపే క్రమంలోనే ఫ్యాన్స్, థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంతమంది అభిమానులు సిబ్బందిని చితకబాదారు. దీంతో నిర్వాహకులు షోను నిలిపివేశారు.

Read More: Devara: మనల్ని ఎవడ్రా ఆపేది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ.. దేశవ్యాప్తంగా ‘దేవర’ సెలబ్రేషన్స్..

Advertisement

Next Story

Most Viewed