Pawan Kalyan:నేడు ద్వారకా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

by Jakkula Mamatha |
Pawan Kalyan:నేడు ద్వారకా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రజెంట్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) నేడు(శుక్రవారం) ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల(Tirumala)లో పర్యటించనున్నారు. ఈ తరుణంలో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు.

అనంతరం.. ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఏపీ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏపీలో 1.55 కోట్ల మందికి దీపం-2 పథకం వర్తింపజేస్తున్నామని తెలిపారు. ఇక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎవరూ నమ్మవద్దని మంత్రి నాదెండ్ల సూచించారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ పథకానికి అర్హులేనని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed