AP:‘వారంలో ఒక రోజైన అలా చేయండి’..ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కీలక విజ్ఞప్తి!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-07 15:32:54.0  )
AP:‘వారంలో ఒక రోజైన అలా చేయండి’..ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కీలక విజ్ఞప్తి!
X

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. నేడు (బుధవారం) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటాదని అన్నారు. కొన్నేళ్ల క్రితం తాను చెప్పినట్లుగా చేనేత వస్త్రాలే ధరిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయన్నారు. ఈ రంగంపై జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆ రంగానికి అండగా ఉంటాం అని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరిస్తే..నేతన్నలకు ధీమా కలుగుతుంది’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed