- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్..కారణం ఏంటంటే?
దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమానికై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి (శుక్రవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న జల జీవన్ మిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన జల జీవన్ మిషన్ పథకం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారనే దానిపై దృష్టి సారించింది. అందులో భాగంగా శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే తొలిసారి కేంద్ర మంత్రితో సమీక్షకు హాజరుకానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈక్రమంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.