సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Mahesh |   ( Updated:2024-10-02 04:58:53.0  )
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ సుప్రీంకోర్టులోవిచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ కల్తీ (Adulteration of Laddu) వివాదంపై మంత్రి సుబ్రహ్మణ్యస్వామి (Subrahmanya swamy) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్‌ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ సీఎం చేసిన ప్రకటన దీనికి భిన్నంగా ఉండటం ఏంటని. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారని. అలాగే విచారణ కోసం సిట్‌ని ఏర్పాటు చేసిన తరువాత కూడా సీఎం మీడియా ముందు ప్రకటనలు ఎందుకు చేశారని సుప్రీంకోర్టు నిలదీసింది.

కాగా కోర్టు వ్యాఖ్యలపై మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సీఎం చంద్రబాబు తన వద్ద ఉన్న సమాచారాన్ని మాత్రమే తెలిపారని.. గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని, ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ జరుపుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. అలాగే తాను చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డు కోసం కాదు కాదని చెప్పుకొచ్చారు. లడ్డూ వివాదం కేవలం ట్రిగ్గర్‌ మాత్రమే అని.. రాష్ట్రంలో కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారని..రామతీర్థంలో రాముడి తల నరికారని గుర్తు చేశారు. తాను చేస్తుందన్నది కేవలం ప్రాయశ్చిత్త దీక్ష మాత్రమే కాదని.. శాశ్వత పరిష్కారం కోరుతూ చేపట్టిన దీక్ష అని.. సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంపై ఎక్కువ మాట్లాడను అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Read More : ఆ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌‌కు ఇష్టమైన డైరెక్టర్ ఇతడే?

Advertisement

Next Story

Most Viewed