Deputy CM Pawan Kalyan: పల్నాడులో పవన్ ‌కల్యాణ్.. వైసీపీకి పవర్‌ఫుల్‌ వార్నింగ్

by karthikeya |   ( Updated:2024-11-05 09:39:52.0  )
Deputy CM Pawan Kalyan: పల్నాడులో పవన్ ‌కల్యాణ్.. వైసీపీకి పవర్‌ఫుల్‌ వార్నింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్నాడు పర్యటన కొనసాగుతోంది. స్థానిక సరస్వతి పవర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించడానికి ఈ రోజు (మంగళవారం) డిప్యూటీ సీఎం పల్నాడు జిల్లాలోని వేమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ర్యాలీగా వెళుతూ ప్రజలతో ప్రసంగించారు. గత ప్రభుత్వంలో రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారని, భూములు ఇవ్వబోమన్న వారిపై పెట్రోల్ బాంబులు వేసి వేధించారని, మరి ఇన్నేళ్లయినా రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి ఇవ్వరనే వైఎస్‌ఆర్ హయాంలో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ భూములపై అనేక అనుమానాలు ఉన్నాయని, అందుకే విచారణకు ఆదేశించామని వివరించారు.

‘‘20 లక్షల ఫర్నిచర్ కోసం కోడెలను వేధించారు. పేదలకు ఇచ్చిన భూములు కూడా బలవంతంగా లాక్కున్నారు. దళితుల భూమి తీసుకున్నారు. వైఎస్‌ఆర్ హయాంలో సరస్వతి పవర్ ప్రాజెక్ట్‌కు అనుమతిచ్చారు. సరస్వతి భూముల రైతులకు న్యాయం జరగలేదు. అందులో 1,384 ఎకరాల్లో 24 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. ఇంత చేసినా ఫ్యాక్టరీ పెట్టలేదు కానీ అన్నాచెల్లెళ్లు కొట్టుకుంటున్నారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 50 ఏళ్లకు లీజు తీసుకున్నారు. ఈ భూములపై అనేక అనుమానాలు ఉన్నాయని, అందుకే విచారణకు ఆదేశించాం. మేం మెతక వైఖరితో లేమని చెప్పడానికి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను’’ అంటూ వైసీపీకి పవర్‌‌ఫుర్ వార్నింగ్ ఇచ్చారు.

Read More..

DGP: గత ఐదేళ్లలో తప్పులు జరిగినది వాస్తవమే.. ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు

Advertisement

Next Story