తీరంలో సముద్ర కోత నివారణ పై డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్..!

by Jakkula Mamatha |
తీరంలో సముద్ర కోత నివారణ పై డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్..!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ బుధవారం సముద్ర తీర ప్రాంతం కోతపై పూర్తి స్థాయి అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) సముద్ర తీర ప్రాంతాల్లో కోత సమస్యలపై కీలక సూచనలు చేశారు. ఈ రోజు సముద్ర కోత నివారణపై అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సముద్ర తీరంలో కోత నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తీర ప్రాంత నిర్వహణపై నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ రూపొందించిన ప్రణాళికను ఉప ముఖ్యమంత్రి విడుదల చేశారు. రాష్ట్రంలో తీరం వెంబడి కోత సమస్యలు ఆందోళన కలిగిస్తోంది అన్నారు. ఉప్పాడ సహా కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది? అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. సముద్ర తీరంలో కోత సమస్యల పై రక్షణ చర్యల గురించి అధ్యయనం చేయాలని ఆదేశాలిచ్చాం అని అధికారుల భేటీలో పవన్ వ్యాఖ్యనించారు.

Advertisement

Next Story

Most Viewed