- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
SBI చైర్మన్‌గా శ్రీ చల్లా శ్రీనివాసులు..అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం
దిశ,వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) చైర్మన్‌గా శ్రీ చల్లా శ్రీనివాసులు శెట్టి గారి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డు సిఫార్సు చేయడం తెలుగువారందరికీ గర్వకారణం అని జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలుగు వారైన చల్లా తెలంగాణ లోని ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం తెలంగాణ లోనే సాగింది. 1988లో ఎస్‌బీఐలో పీవోగా చేరారు. బ్యాంకింగ్ రంగంలో 35 ఏళ్ల అనుభవం ఆయన సొంతం. ఈ నేపథ్యంలో SBI చైర్మన్‌గా నియమితులైన శ్రీ శ్రీనివాసులు శెట్టి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన నేతృత్వంలో ఎస్‌బీఐ మరెన్నో మైలురాళ్ళు అందుకోవాలి అన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారుల సాధకబాధకాలు తెలిసిన శ్రీ శ్రీనివాసులు శెట్టి గారు ఆయా వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరింప చేయాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.