TTD:శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. జనవరి నెల దర్శన టికెట్లు విడుదల?

by Jakkula Mamatha |   ( Updated:2024-10-16 11:53:08.0  )
TTD:శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. జనవరి నెల దర్శన టికెట్లు విడుదల?
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో తిరుమల వెళ్లడానికి ముందస్తు ప్రణాళికతో ఉన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 19వ తేదీ నుంచి 23 తేదీ వరకు ఆన్‌లైన్‌లో జనవరి నెలకు సంభందించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ క్రమంలో శ్రీవారి భక్తులు ముందస్తు జాగ్రత్తగా టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ టికెట్లు తొందరగా అయిపోతాయి.

ఈ నెల(అక్టోబర్)లో విడుదలయ్యే శ్రీవారి దర్శన టికెట్ల వివరాలు..

*19 తేది నుంచి 21 తేదీ ఉదయం వరకు లక్కీ డిఫ్ విధానంలో కేటాయించే అర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు.

*22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం ఉంజల్ సేవా ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనుంది.

*23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ దర్శనం టోకెన్లు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులు దర్శన టికెట్లు విడుదల చేయనుంది.

*24 వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌నం టికెట్లు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story
null