విజయవాడ బస్సు ప్రమాదంపై దగ్గుబాటి పురంధేశ్వరి దిగ్భ్రాంతి

by Seetharam |
విజయవాడ బస్సు ప్రమాదంపై దగ్గుబాటి పురంధేశ్వరి దిగ్భ్రాంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్ విజయవాడ అని నిత్యం వేలాది మంది ప్రయాణికులతో ఇది కిక్కిరిసిపోతుందని స్పష్టం చేశారు. అలాంటి బస్టాండ్‌లో ఈ తరహా సంఘటన చోటు చేసుకోవడం ముగ్గురు మృతి చెందడంపై పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని.. తక్షణమే ఆర్థిక సహకారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు.

Advertisement

Next Story