Garlic Seize: తెగులు సోకిన చైనా వెల్లుల్లి సీజ్..

by Rani Yarlagadda |
Garlic Seize: తెగులు సోకిన చైనా వెల్లుల్లి సీజ్..
X

దిశ, వెబ్ డెస్క్: మారదు లోకం.. మారదు కాలం.. ప్రజల ప్రాణాలెన్ని పోతున్నా.. కల్తీ ఆహార పదార్థాలు, పాడైన నిత్యావసరాలను అమ్మడం ఆపరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేసి.. నిల్వ ఉంచిన, డేట్ ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ కుప్పలు తెప్పలుగా లభ్యమవుతున్నాయి. అల్లం లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్న ఘటన వెలుగుచూసినప్పటి నుంచీ.. అసలు మనం తినే ఫుడ్ లో ఇంకా ఏమేం కలుపుతున్నారోనన్న భయం మొదలైంది.

తాజాగా.. చైనా నుంచి దిగుమతి అయిన తెగులు సోకిన వెల్లుల్లిని (China Garlic) కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన తెలంగాణలో కాదు.. ఈసారి ఏపీలో వెలుగుచూసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైనా వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం నిషేధం. అయినా అక్రమదారులు.. వెల్లుల్లిని దిగుమతి చేసుకున్నారు. అదేమైనా మంచి క్వాలిటీనా అంటే అదీ కాదు. వెల్లుల్లి బస్తాలతో వెళ్తున్న వ్యానును నెల్లూరు (Nellore) సమీపంలో పట్టుకున్నారు. వాటిని తెరిచి చూడగా.. వెల్లుల్లికి తెగులు పట్టి కనిపించింది. దీంతో 9,990 కిలోల వెల్లుల్లిని సీజ్ చేశారు. వాటి విలువ సుమారు రూ.21.97 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

Advertisement

Next Story

Most Viewed