‘పవన్ కల్యాణ్‌కు డీసీఎం పదవి అవసరమా?’.. సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-02-16 06:50:24.0  )
‘పవన్ కల్యాణ్‌కు డీసీఎం పదవి అవసరమా?’.. సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Rama Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సీపీఐ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు దేవదాయ శాఖ(Devadaya branch) ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించడానికి పుట్టానని చెబుతున్న పవన్‌ కళ్యాణ్.. కాషాయ దుస్తులు వేసుకుని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

డిప్యూటీ సీఎం(Deputy CM)గా ఉండి పాలన చేయకుండా లడ్డూ(Tirumala Laddu)లో కల్తీ పేరుతో మౌన దీక్ష చేస్తా అనడం సబబు కాదన్నారు. ప్రశ్నించడం, పాలించడం మానేసి తిరిగే పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి(Deputy CM Post) అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. కేబినెట్‌లో ఉన్న పవన్ ప్రశ్నించకుండా మౌన దీక్షలు, కాషాయం అంటూ తిరగడం వింతగా ఉందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా జరగని దోపిడీ మన రాష్ట్రంలో జరిగిందని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో అదానీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టులకు 2022లో ఏకంగా 2,500 ఎకరాలను కేటాయించారని మండిపడ్డారు.

Next Story

Most Viewed