AP News:సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

by Jakkula Mamatha |
AP News:సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి(CPI State Secretary)కె.రామకృష్ణ(K. Ramakrishna) లేఖ రాశారు. అదానీ ఇచ్చిన ముడుపుల్లో 86% దాదాపు రూ.1750 కోట్లు గత వైసీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో చేతులు మారాయని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(US Securities and Exchange Commission) బయటపెట్టింది అని లేఖలో పేర్కొన్నారు. అదానీతో కుదుర్చుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాల వల్ల 25 ఏళ్ల పాటు లక్ష కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుంది. మన రాష్ట్రంలో కాకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తి రాజస్థాన్‌లో చేపట్టడం వల్ల దాదాపు రూ.8 వేల కోట్లు పన్నుల రూపంలో రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కుతుండగా, రాజస్థాన్‌లో 14 వేల మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు, సౌర విద్యుత్ కోసం భూములు ఇచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లీజు లభిస్తుంది. సౌర విద్యుత్ ఒప్పందాలలో లోపాలపై సీపీఐ తరఫున హైకోర్టులో నేను ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయగా, నేటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా మరో పిటిషన్ వేశారు. కోర్టులో వేసిన పిటిషన్‌లు పెండింగ్‌లో ఉండటం, 2024 అక్టోబర్ నాటికి అందాల్సిన 3000 మెగావాట్ల సౌర విద్యుత్ అందకపోవటం, అదానీ అవినీతి ఆరోపణల దృష్ట్యా సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతున్నాను అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed