- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం జగన్ ఢిల్లీటూర్ సీక్రేట్ చెప్పిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇంతకీ అదేంటంటే!
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాక్యలు చేశారు. వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని స్వప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కృష్ణా జలాల పునఃపంపిణీ గెజిట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో 30గంటల నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు నారాయణతో పాటు మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. ఢిల్లీ పెద్దలను కేవలం తన కేసుల గురించి మాత్రమే కలుస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రాన్ని ప్రశ్నించడంలో సీఎం విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కేసుల భయంతోనే జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని చెప్పుకొచ్చారు. ప్రజలు భారీ మెజారిటీతో వైసీపీని గెలిపిస్తే ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడంలో ఆ పార్టీ విఫలమైందని మండిపడ్డారు. కేవలం జైలుకు వెళ్లకుండా ఉండేందుకే కేంద్రానికి జగన్ మద్దతు పలుకుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
440 మండలాల్లో కరవు తీవ్రత
ఏపీలో 440 మండలాల్లో కరవు తీవ్రంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని చెప్పుకొచ్చారు. అయితే కరవు తీవ్రతను తగ్గించేలా సీఎం వైఎస్ జగన్ మాట్లాడటం బాధాకరమన్నారు. కరవు నష్టపరిహారంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. తక్షణమే రైతులకు నష్టపరిహారంతో పాటు రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కొరతతో ప్రాజెక్టులు ఎండిపోయాయని ఫలితంగా సాగునీరు లేక రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు ప్రభావంపై సీఎం జగన్ ఇప్పటికీ సమీక్ష చేయలేదని కానీ కరవు తీవ్రత తక్కువగా ఉందని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
Read More..
ఇన్సూరెన్స్ ఉన్నా లేకున్నా బోటుకు 80శాతం పరిహారం ఇవ్వాల్సిందే: విశాఖ ఘటనపై సీఎం జగన్