CPI: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీబీఐపై కె రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-06-12 15:04:10.0  )
CPI: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీబీఐపై కె రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాల పర్యటించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తప్పుబట్టారు. ఏ మొహం పెట్టుకుని రాష్ట్రంలో పర్యటించారని ప్రశ్నించారు. ఏపీలో ప్రచారం చేసేందుకు బీజేపీకి సిగ్గుండాలంటూ ఘాటు విమర్శలు చేశారు. విజయవాడలో సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ దేశ అప్పులను రూ.155 లక్షల కోట్లకు చేర్చినందుకు మోడీ గ్లోబల్ లీడర్ అయ్యారా? అని నిలదీశారు. ‘67 ఏళ్లలో ప్రభుత్వాలు చేసిన రూ.55 లక్షల కోట్ల అప్పులకన్నా, 9 ఏళ్ల మోడీ పాలనలో చేసిన అప్పు రెండింతలు చేసినందుకు గ్లోబల్ లీడర్ అయ్యారా?, దేశంలో నిరుద్యోగాన్ని పెంచినందుకా? 27 మంది గుజరాత్ వాళ్ళు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి పారిపోయినందుకా?. అదానీ, అంబానీలకు వూడిగం చేస్తున్నందుకా?. ఎందుకు నరేంద్ర మోడీ గ్లోబల్ లీడర్ అయ్యారు’ అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంటే కేంద్రంలో హోంమంత్రి స్థానంలో ఉండి గత 4 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని అమిత్ షాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ నిలదీశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయలేని దద్దమ్మగా సీబీఐ వ్యవహరించడం వెనుక అమిత్ షా పాత్ర లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ అమిత్ షా కనుసన్నల్లో నడుస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి 3 ఏళ్లుగా సీబీఐ విచారణ సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కవ్వడం వల్లే అవినాశ్ రెడ్డి అరెస్టు జరగడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

Congress: అమిత్ షా ఆరోపణలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి: జంగా గౌతమ్

Advertisement

Next Story