AP Assembly Sessions:‘పంచాయతీరాజ్ శాఖలో అవినీతి’ ..డిప్యూటీ సీఎం పవన్ సెన్సేషనల్ కామెంట్స్..!

by Jakkula Mamatha |
AP Assembly Sessions:‘పంచాయతీరాజ్ శాఖలో అవినీతి’ ..డిప్యూటీ సీఎం పవన్ సెన్సేషనల్ కామెంట్స్..!
X

దిశ ప్రతినిధి,విజయవాడ:పంచాయతీకి సంబంధించిన నిధులు పంచాయతీలకే వాడాలని శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు పంచాయతీలకు వస్తాయన్నారు. రూ. 9098 కోట్ల నిధులు మార్చికి విడుదల కావాల్సి ఉండగా ఇంకా నిధులు విడుదల కాలేదని నిధులు విడుదలకు సంబంధించి అధికారులతో కూర్చుని చర్చిస్తామని అన్నారు. రూ. 7518 కోట్లు ఇప్పటిదాకా పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్‌కి విడుదల చేయడం జరిగిందని..8 సార్లు ఇప్పటివరకు నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులు పంచాయతీలకు ఎప్పుడు ఆలస్యంగానే వెళ్లాయన్నారు.

కేంద్రం నుంచి సమయానికి నిధులు రాష్ట్రానికి వచ్చినా..రాష్ట్ర ప్రభుత్వం ఐదుసార్లు పంచాయతీకి నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1100 కోట్లు పెనాల్టీ కేంద్రానికి కట్టిందన్నారు. పంచాయతీ సర్పంచ్‌ల అనుమతి లేకుండా రూ. 2165 కోట్ల నిధులు డిస్కంలకు గత ప్రభుత్వం కట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన అవినీతి పై కమిషన్ వేసే ఆలోచనలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖలో ఎంత మేరా అవినీతి జరిగిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా రాష్ట్ర పంచాయతీలకు వచ్చి విచారణ చేశారన్నారు.



Next Story