- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమార్కులు దొరికారు
వారు జిల్లా అధికారులు.. ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ధనం వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత కలిగిన వారు. అక్రమాలు, అవినీతిపై ఉక్కుపాదం మోపాల్సిన వారు. కానీ వారే అక్రమాలకు పాల్పడితే.. అక్రమంగా వస్తున్న సొమ్ములు జేబులో వేసుకుంటుంటే.. బినామీల పేరిట వేలాది రూపాయలు దోచుకుంటుంటే.. వారినేమనాలి. ఇదిగో జిల్లా కర్మాగారాల శాఖాధికారులు అనాలి. ఎందుకంటే ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకుంటున్నారు. దీనిపై దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం.
దిశ (ఉభయ గోదావరి ప్రతినిధి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు కర్మాగారాల శాఖాధికారి ఉంటారు. వీరు జిల్లాలో అనేక కర్మాగారాలు తిరగాల్సి ఉంది. అక్కడ ప్రభుత్వ నిబంధనలు అమలు లో ఉన్నాయా ? లేదా ? అని పర్యవేస్తుండాలి. కర్మాగారం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లనుందా అనే విషయాలు గమనించాలి. అవసరం అయితే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. దీని కోసం ప్రతి జిల్లా అధికారికీ ప్రభుత్వం వాహన సదుపాయం కల్పించింది.
ఆయా వాహనంలో వారు పర్యటించి తనిఖీలు చేయాల్సి ఉంది. ఇది సంబంధిత అధికారులకు కాసుల పంట పండిస్తోంది. ఇదెలాగంటే జిల్లా అధికారి ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ను సంప్రదిస్తున్నారు. ట్రావెల్స్ కారును కర్మాగారాల శాఖకు లీజుకు ఇస్తున్నట్లుగా ఒప్పందం రాయించుకుంటున్నారు. నెలకు 2500 కిలోమీటర్లు గాను రూ. 35 వేలు అద్దె చెల్లించేలా ఆ ఒప్పందంలో పేర్కొంటున్నారు.
తనిఖీలు సొంత కారులోనే..
లీజుకు తీసుకున్న కారుకి జిల్లా అధికారులు గవర్నమెంట్ డ్యూటీ అని ఒక బోర్డు తగిలిస్తున్నారు. ఇక తమ సొంత కారుల్లో తనిఖీలు నామమాత్రంగా చేస్తున్నారు. అయితే లెక్కల్లో మాత్రం ప్రతి నెలా 2500 కిలోమీటర్లు తిరిగినట్లుగా రాస్తున్నారు. దీని ప్రకారం నెలకు రూ.35 వేల చెల్లిస్తున్నారు. ఇందులో కారు లీజుకు ఇచ్చిన ట్రావెన్స్ వారికి సంబంధిత అధికారి రూ.5 వేలు అందిస్తున్నారు. మిగిలిన సొమ్మును తన జేబుల్లో వేసుకుంటున్నారు.
నిబంధనలివీ..
వాస్తవానికి కారు అద్దెకు తీసుకొనే ముందు సదరు శాఖ పేపరు నోటిఫికేషన్ ఇవ్వాలి. తద్వారా అనుభవం కలిగిన కారు ట్రావెల్ వారిని ఆహ్వానించాలి. అవసరమైతే ఓపెన్ ఆక్షన్ కు పిలవాలి. అప్పుడే కారు అద్దెకు తీసుకోవాలి. పొరపాటున కూడా సొంత కారు వినియోగించరాదు. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడా కూడా ఇది జరగడం లేదు.
తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో చెక్ చేయండి
జిల్లా కర్మాగారాల అధికారులు నిత్యం తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో పరిశీలించండి. అవసరం అయితే టోల్ గేట్లు తనిఖీ చేయండి. కారు మీటరు చెక్ చేయండి. అది వాస్తవానికి అగ్రిమెంటు అయిన కారా ? లేక సొంత కారా ? అనేది పరిశీలించండి.. అప్పడే నిజాలు బయట పడతాయి. ప్రభుత్వ ఆదాయం మిగులుతుంది-తాడి ప్రసాద్ , బెటర్ లివింగ్ సంస్థ చైర్మన్