- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో సంచలనంగా మారిన దువ్వాడ ఫ్యామిలీ గొడవ.. జగన్‌ను మధ్యలోకి లాగిన MLC
దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ గొడవపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం ఉన్నా.. లేకున్నా ఒకే విధంగా పనిచేస్తున్నా అని అన్నారు. 25 ఏళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ వస్తున్నానని తెలిపారు. కానీ, చివరకు నా కుటుంబమే నాపై దాడికి రెడీ అయిందని ఆవేదన చెందారు. ఓ కూతురు పెళ్లి చేశాను.. మరో కూతురి పెళ్లి చేయాల్సి ఉందని అన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవతంలో ఏనాడూ ఎవరి వద్ద లంచం తీసుకోలేదని తెలిపారు.
నా భార్య వాణికి రాజకీయ కోరిక ఎక్కువ అని కీలక వ్యాఖ్యలు చేశారు. మైనింగ్‌ను తన పేరు మీదకు మార్చాలని అనేకసార్లు గొడవ పడిందని గుర్తుచేశారు. పిల్లలకు కూడా నా గురించి చెడుగా చెప్పుకుంటూ పెంచిందని అన్నారు. ఇన్నాళ్లూ భార్యా, పిల్లలను గుండెలపై పెట్టుకొని చూసుకున్నా అని అన్నారు. అలాంటి నాతో విడాకులు ఇప్పించాలని జగన్‌కు చెప్పిందని గుర్తుచేశారు. కాగా, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్యా, పిల్లలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.