- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ వైఖరి సరికాదు.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
దిశ, ఏపీ బ్యూరో : పీఆర్సీ విషయంలో ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఆరోపించారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల విషయంలో మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకులు న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నారా లేదా అనే అంశంపై ప్రజలు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని ఇరువురు సర్వనాశనం చేయాలని చూస్తున్నారన్న అనుమానం కలుగుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలని మస్తాన్ వలి డిమాండ్ చేశారు.