- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ ఉక్కుపై కుట్రలు పన్నుతున్నారు.. షర్మిల కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు పోరాటం చేయలేదని ఆమె ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభజన హామీలపై వైసీపీ నాయకులు పోరాటం చేయకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కుట్రలు పన్నుతున్నారని షర్మిల మండిపడ్డారు. ఇందులో భాగంగానే పరిశ్రమను నష్టాల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు. 30 వేల మంది కార్మికుల బతుకులు రోడ్డు మీదకు నెడుతున్నారని వ్యాఖ్యానించారు. తమ ప్రాణాలు అడ్డువేసి అయినా సరే విశాఖ ఉక్కును కాపాడుకుంటామని హెచ్చరించారు. ప్రతేక హోదా, ఏపీ రాజధానిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన ల్యాండ్, మైనింగ్, లిక్కర్ మాఫియనే కనిపిస్తోందని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైందని షర్మిల నిలదీశారు.