- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హస్తం పార్టీకి తీవ్ర నష్టం.. అక్కడ కాంగ్రెస్ కనుమరుగే(నా)..?
దిశ, జంగారెడ్డిగూడెం/ఏలూరు: వైఎస్ మరణం, ఆంధ్ర రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావం వంటి పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతింది. అయితే కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీని వీడకుండా ఉండడంతో కొంతమేరైనా ప్రజలు కాంగ్రెస్‌ను గుర్తు పెట్టుకున్నారు. అలాంటి నేతల్లో ఏలూరు జిల్లాకు చెందిన జెట్టి గురునాథరావు ఒకరు. కాంగ్రెస్ అగ్ర నేతల్లో సత్సంబంధాలు ఉన్న గురునాథరావు తాజాగా పార్టీ మారబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే ఏలూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్‌కి ఆయనే కీలకం
ఏలూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంటే వినపడే పేరు జెట్టి గురునాథరావు. సుమారు 20 ఏళ్ల రాజకీయ అనుభవంతో పాటు పలు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పని చేసిన అనుభవం ఉంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అధిష్టానం ఆదేశాలతో పార్లమెంట్ స్థానం అభ్యర్థిగా పోటీ చేశారు. తనకంటూ సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర పునః విభజన తర్వాత ప్రజలు మరిచిన కాంగ్రెస్‌ని తన భుజాలపై మోశారు. ఇలాంటి వ్యక్తి పార్టీని వీడితే ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా క్యాడర్‌కూ వెళ్లిపోతుందని హస్తం అధిష్టానం భయపడుతున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో ప్రత్యేక పాత్ర
గంగాథర రావు జంగారెడ్డిగూడేనికి చెందిన వ్యక్తి. జిల్లాలోని చింతలపూడి, పోలవరం, గోపాలపురం రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ప్రజలతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం భారీగానే కనిపించింది. ఈ క్రమంలో ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, వైసీపీ నాయకత్వం ఆయన చేరిక కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.