- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్లవల్లేరు కెమెరాల వ్యవహారాన్ని ఆరా తీసిన కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
దిశ, వెబ్‌డెస్క్: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ ఘటనపై కలెక్టర్, ఎస్పీ విచారణ చేపట్టారు. కృష్ణ జిల్లా ఎస్పీ గంగాధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఇష్యూపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేరానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. అనుమానితుడి నుంచి లాప్ టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించి.. విద్యార్థుల ఆందోళనపై ఆరాతీసింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించింది. ఇలాంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకూడదని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా.. మరికొంతమంది విద్యార్థులు వాష్ రూమ్ లో ఒక కెమెరా దొరికిందని ఆరోపిస్తున్నారు.అందులో ఎన్ని వీడియోలు ఉన్నాయో ఇంకా తెలియదని భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు వచ్చాక మాత్రం అలాంటివేవీ లేవని చెబుతున్నారని అంటున్నారు. ఎప్పుడూ సెలవు ఇవ్వని కాలేజీ యాజమాన్యం అర్థంతరంగా సెలవు ఎందుకు ఇచ్చిందో తెలియడం లేదంటున్నారు. గుడ్లవల్లేరు ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర కాలేజీకి వెళ్లారు. అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో మాట్లాడారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.